ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి చర్యలు

ABN , First Publish Date - 2021-08-28T03:47:03+05:30 IST

జగనన్న లేఅవుట్లలో త్వరితగతిన ఇళు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌ విదేహ్‌ఖరే అన్నారు.

ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి చర్యలు
సచివాలయాన్ని తనిఖీ చేస్తున్న హౌసింగ్‌జేసీ విదేహ్‌ఖరే

చిల్లకూరు, ఆగస్టు 27: జగనన్న లేఅవుట్లలో త్వరితగతిన ఇళు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌ విదేహ్‌ఖరే అన్నారు. శుక్రవారం స్థానిక డంపింగ్‌యార్డు సమీపంలోని లేఅవుట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లేఅవుట్లలో విద్యుత్‌, తాగునీరు వంటి అన్ని వసతులు కల్పించామన్నారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు అవగాహన కల్పించి,  త్వరగా ఇళ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. అనంతరం స్థానిక సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట హౌసింగ్‌ డీఈ చలమయ్య, ఏఈ మధుసూదన్‌రావు తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-08-28T03:47:03+05:30 IST