అనుమతులు లేని దుకాణాలపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-08-22T03:46:00+05:30 IST

గూడూరు పట్టణంలో అనుమతులు లేకుండా జ్యుయలరీ, కుదువ దుకాణాలను నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పరిమల వెంకటేశ్వర్లు కోరారు

అనుమతులు లేని దుకాణాలపై చర్యలు తీసుకోవాలి
సీటీవో గోపీచంద్‌కు వినతిపత్రం అందజేస్తున్న పరిమల వెంకటేశ్వర్లు

గూడూరురూరల్‌, ఆగస్టు 21: గూడూరు పట్టణంలో అనుమతులు లేకుండా జ్యుయలరీ, కుదువ దుకాణాలను నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పరిమల వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు శనివారం స్థానిక  వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో సీటీవో గోపీచంద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో 200 వరకు కుదువ దుకాణాలు ఉన్నాయన్నారు. వాటిలో 75 దుకాణాల మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతి ఉందన్నారు. నిబంధనలు పాటించకుండా కొందరు వ్యాపారాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. కొన్నిచోట్ల దుకాణాల నిర్వాహకులు మృతి చెందితే కుదువదారులకు వస్తువులను ఇవ్వకుండా దుకాణాలను మూసివేస్తున్నారన్నారు. అధికారులు విచారణ చేసి రుణగ్రహీతలకు న్యాయం చేయాలన్నారు. 

Updated Date - 2021-08-22T03:46:00+05:30 IST