ఫిట్‌నెస్‌ లేని విద్యాసంస్థల బస్సులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-31T04:24:52+05:30 IST

ఫిట్‌నెస్‌ లేని విద్యాసంస్థల బస్సులపై చర్యలు తీసుకోవాలని గురువారం ఇన్‌చార్జి ఆర్టీవో మురళీమోహన్‌, ఏఎంవీఐ శేషురెడ్డికి ఏబీవీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.

ఫిట్‌నెస్‌ లేని విద్యాసంస్థల బస్సులపై చర్యలు తీసుకోవాలి
సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

గూడూరు, డిసెంబరు 30: ఫిట్‌నెస్‌ లేని విద్యాసంస్థల బస్సులపై చర్యలు తీసుకోవాలని గురువారం ఇన్‌చార్జి ఆర్టీవో మురళీమోహన్‌, ఏఎంవీఐ శేషురెడ్డికి ఏబీవీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ నాయకుడు మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ  ఫిట్‌నెస్‌ లేని కారణంగా విద్యాసంస్థలకు చెందిన బస్సులు తరచూ ప్రమాదాల పాలవుతున్నాయన్నారు.  కార్యక్రమంలో చిన్నా, కాశీరామ్‌, చరణ్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు. ఇదే సమస్యపై టీఎన్‌ఎస్‌ఎఫ్‌ సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆసంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వాహనాల ఫిట్‌నెస్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. శశికుమార్‌, నవీన్‌చంద్ర, ప్రసాద్‌, మహేష్‌, సాయితేజ, సాయి, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T04:24:52+05:30 IST