అదృశ్యమైన వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-10-22T04:49:59+05:30 IST

మండలంలోని కోలగట్లలో అదృశ్యమైన వ్యక్తి అనుమానా స్పదంగా మృతిచెందిన ఘటన గురువారం ఆలస్యంగా గుర్తించారు. గ్రామానికి చెందిన ఆర్‌.సురేంద్రరెడ్డి (35)

అదృశ్యమైన వ్యక్తి అనుమానాస్పద మృతి

సంగం, అక్టోబరు 21: మండలంలోని కోలగట్లలో అదృశ్యమైన వ్యక్తి అనుమానా స్పదంగా మృతిచెందిన ఘటన గురువారం ఆలస్యంగా గుర్తించారు. గ్రామానికి చెందిన ఆర్‌.సురేంద్రరెడ్డి (35) వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు.  భార్య, కుమారుడు ఉన్నారు. గతంలో ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన వైద్యశాలకని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి వెళ్లలేదు. ఫోన్‌ చేసినా ఎటువంటి సమాచారం లేదు. దీంతో కుటుంబసభ్యులు 19వ తేదీన సంగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అదేరోజు కోవూరు పడుగుపాడు వద్ద రైల్వే పట్టాలపై అనుమానాస్పదంగా ఓ మృతదేహాన్ని గుర్తించారు. రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దొరికిన ఆధారాలతో గురువారం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు చూపించిన దుస్తులను పరిశీలించి సురేంద్రరెడ్డిగా గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.

Updated Date - 2021-10-22T04:49:59+05:30 IST