రైలుపట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-07-25T04:10:26+05:30 IST
దేవాలయం స్తంభానికి తాడుతో కట్టేసి కోట్టిన కేసులో తనకు న్యాయం జరగలేదంటూ మండలంలోని పల్లిపాడు గ్రామానికి చెందిన గంప వెంకటేశ్వర్లు శనివారం వెందోడు రైల్వే స్టేషన్ సమీపంలో రైలుపట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

బాలాయపల్లి, జూలై 24 : దేవాలయం స్తంభానికి తాడుతో కట్టేసి కోట్టిన కేసులో తనకు న్యాయం జరగలేదంటూ మండలంలోని పల్లిపాడు గ్రామానికి చెందిన గంప వెంకటేశ్వర్లు శనివారం వెందోడు రైల్వే స్టేషన్ సమీపంలో రైలుపట్టాలపై పడుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పరుగులు తీసి అతనిని కాపాడారు.