విద్యార్థులకు పాఠశాల స్థాయి పరీక్షలు
ABN , First Publish Date - 2021-01-21T05:06:43+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనోహర్‌రెడ్డి మెమోరియల్ సెర్చ్ పరీక్ష జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో బుధవారం పాఠశాల స్థాయిలో జరిగింది

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జనవరి 20 : ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనోహర్‌రెడ్డి మెమోరియల్ సెర్చ్ పరీక్ష జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో బుధవారం పాఠశాల స్థాయిలో జరిగింది. నెల్లూరు జాకీర్ హుస్సేన్ నగర్‌లోని ఎస్‌వీఆర్ పాఠశాలలో జరిగిన పరీక్షను అపస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేతాజీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులో స్నేహాభావం, పోటీతత్వం పెంపొందించేందుకు ఈ పరీక్షలను మూడు దశల్లో నిర్వహి స్తున్నామని చెప్పారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అందే శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.