విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2021-11-10T04:23:55+05:30 IST

విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని స్థానిక న్యాయవాది సందిరెడ్డి రామారావు పేర్కొన్నారు.

విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన ఉండాలి
మాట్లాడుతున్న న్యాయవాది రామారావు

ఉదయగిరి రూరల్‌, నవంబరు 9 : విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని స్థానిక న్యాయవాది సందిరెడ్డి రామారావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఏఆర్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల ఆవరణలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల రక్షణ కోసం కల్పిస్తున్న చట్టాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. కౌమార దశలో విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు భయపడరాదన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు షరీఫ్‌, తిరుపతయ్య, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ కిరణ్‌, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-10T04:23:55+05:30 IST