పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-11-10T04:26:38+05:30 IST

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో విద్యార్థులు తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి
తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

తహసీల్దారు కార్యాలయం ఎదుట విద్యార్థుల ధర్నా

ఉదయగిరి రూరల్‌, నవంబరు 9: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో విద్యార్థులు తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎ్‌ఫఐ డివిజన్‌ కార్యదర్శి కె.వెంకటకృష్ణ మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో 720 మంది విద్యార్థులు ఉండగా ఎనిమిది గదులు మాత్రమే ఉన్నాయన్నారు. అలాగే 30 మంది ఉపాధ్యాయులకు గాను 16 మంది మాత్రమే ఉన్నారన్నారు. మరోవైపు భవనాలు శిథిలావస్థకు చేరి వర్షాలకు ఉరుస్తూ ఎప్పుడు కూలి ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయోనని తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారన్నారు.  ఈ కార్యక్రమంలో నాయకులు కాకు వెంకటయ్య, దస్తగిరి అహ్మద్‌, రామిరెడ్డి, సురేష్‌, మధు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-10T04:26:38+05:30 IST