విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

ABN , First Publish Date - 2021-11-24T03:41:31+05:30 IST

స్థానిక డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో మంగళవారం ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, పీడీఎస్‌యూ, ఎంఎస్‌ఎఫ్‌ విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
డీఆర్‌డబ్ల్యూ కళాశాల వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థిసంఘాల నాయకులు

గూడూరు, నవంబరు 23: స్థానిక డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో మంగళవారం ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, పీడీఎస్‌యూ, ఎంఎస్‌ఎఫ్‌ విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిసంఘాల నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యావ్యవస్థ అధోగతిపాలైందన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలను మునుపటిలాగే కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో సునీల్‌, సురేష్‌, సాయి, మౌనిక, సుధా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-24T03:41:31+05:30 IST