హస్తకళలకు రాష్ట్రం పుట్టినిల్లు

ABN , First Publish Date - 2021-12-10T02:58:21+05:30 IST

హస్తకళలకు రాష్ట్రం పుట్టినిల్లని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అన్నారు. గురువారం వెంకటగిరి పట్టణంలోని బొప్పాపురం సాలెకాలనీలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల తయారీ విక్రయాల కేంద్రం అతరన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

హస్తకళలకు రాష్ట్రం పుట్టినిల్లు
చేనేత ఇంక్యుబేషన్‌, డిజైనింగ్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

 జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు

వెంకటగిరి, డిసెంబరు 9: హస్తకళలకు రాష్ట్రం పుట్టినిల్లని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అన్నారు. గురువారం వెంకటగిరి పట్టణంలోని బొప్పాపురం సాలెకాలనీలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల తయారీ విక్రయాల కేంద్రం అతరన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. వెంకటగిరి చేనేతకు దేశవిదేశాల్లో ఎంతో పేరు ఉందని ఈ కేంద్రం ద్వారా నేత కార్మికులు అధునాతన సాకేంతిక పరిజ్ఞానంతో కొత్త ఒరవడి తీసుకువచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన టాటా ట్రస్టు నిర్వాహకులను ఆయన అభినందించారు. వరద తాకిడికి నష్టపోయిన నేత కార్మికులకు ఇప్పటి వరకు రూ.90 వేలు పరిహారం అందించా మన్నారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే దరఖాస్తు చేసుకొంటే పరిహారం ఇస్తామన్నారు. ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ విధానంపై ప్రజలకు పూరిగా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో మరో 1.20 లక్షల మంది ఈ పథకంతో లబ్ధిపొందే అవకాశాలు ఉన్నాయన్నారు. అనంతరం బంగారుపేటలోని సచివాలయాన్ని సందర్శించి ఓటీఎస్‌కు  నగదు చెల్లించిన లబ్ధిదారులకు ఇళ్ళ హక్కు పత్రాలను ఆందచేశారు. ఆర్టీవో మురళీకృష్ణ, , మున్సిపల్‌ కమిషనర్‌ మధుకిరణ్‌రెడ్డి, తహసీల్దారు ప్రసాద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నక్కా భానుప్రియ, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నక్కా వెంకటేశ్వరరావు, 4 వార్డు కౌన్సిలర్‌ నారాయణ, 17వ వార్డు కౌన్సిలర్‌ పూజారి లక్ష్మి తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-12-10T02:58:21+05:30 IST