ముగిసిన రాష్ట్ర చెస్‌ టోర్నీ

ABN , First Publish Date - 2021-03-16T05:36:08+05:30 IST

జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర చెస్‌ టోర్నీ ఆదివారం రాత్రి ముగిసింది. విజేతలకు సోమవారం జీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో బహుమతి ప్రదానం చేశారు.

ముగిసిన రాష్ట్ర చెస్‌ టోర్నీ
జ్ఞాపికలతో విజేతలు

ద్వితీయ స్థానంలో జిల్లా క్రీడాకారుడు


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), మార్చి 15: జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర చెస్‌ టోర్నీ ఆదివారం   రాత్రి ముగిసింది. విజేతలకు సోమవారం జీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో బహుమతి ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా బీజేపీ నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు జీ భరత్‌కుమార్‌ యాదవ్‌ హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో చెస్‌ క్రీడకు హబ్‌గా జిల్లా మారడం ఆనందంగా ఉందన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. చెస్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై సుమన్‌ మాట్లాడుతూ ఈ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కే మహేష్‌కుమార్‌ విజేతగా నిలవగా, జిల్లాకు చెందిన డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి ద్వితీయ స్థానం సాధించారన్నారు. మిగిలిన స్థానాల్లో చైతన్య సాయిరాం, ఇమ్రాన్‌, వెంకటరమణ తదితరులు నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీనాయకుడు పొదిలి వినయ్‌శేఖర్‌, నుడా జూనియర్‌ అకౌంటెంట్‌ సీహెచ్‌ సురేష్‌, టోర్నీ నిర్వాహకులు రామ్‌లక్ష్మణ్‌, ఎస్‌ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-16T05:36:08+05:30 IST