జొన్నవాడ ఆలయంలో శ్రావణ శుక్రవార పూజలు

ABN , First Publish Date - 2021-08-28T04:58:24+05:30 IST

మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడింది.

జొన్నవాడ ఆలయంలో శ్రావణ శుక్రవార పూజలు

బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 27: మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, అమ్మవారికి నవావరణ పూజలు జరిగాయి. భక్తులు ఉదయం నుంచి ఉపవాసాలతో ఆలయంలో పిండి దీపారాధనలు వెలిగించారు. రాత్రి ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు సామూహిక కుంకుమార్చన, పల్లకిసేవలు జరిగాయి. ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. 

గంగపట్నం చాముండేశ్వరి ఆలయంలో..

ఇందుకూరుపేట: గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో మూడో శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఇందుకూరుపేట కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ మావులూరు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయకర్తలుగా రాముడు పాళెంకు చెందిన జైకేష్‌, కవిత వ్యవహరించారు. ఆలయ నిర్వాహ కులు శరత్‌నాయుడు, వెంకయ్య ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌, సభ్యులు పర్యవేక్షించారు.


Updated Date - 2021-08-28T04:58:24+05:30 IST