ముమ్మరంగా రోడ్డు మరమ్మతులు

ABN , First Publish Date - 2021-11-22T03:56:42+05:30 IST

తుఫాన్‌ వర్షాలకు దెబ్బతిన్న రాపూరు-చిట్వేలి ఘాట్‌రోడుకు ఆదివారం నుంచి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు.

ముమ్మరంగా రోడ్డు మరమ్మతులు
రాపూరు చిట్వేలి ఘాట్‌రోడ్డులో నిర్వహణ పనులు చేస్తున్న కూలీలు

రాపూరు, నవంబరు 21: తుఫాన్‌ వర్షాలకు దెబ్బతిన్న రాపూరు-చిట్వేలి ఘాట్‌రోడుకు ఆదివారం నుంచి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. వర్షం తో రోడ్డు మార్జిన్లు దెబ్బతిని అడుగులోతు గుంతలు ఏర్పడ్డాయి. సింగిల్‌రోడ్డు కారణంగా ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుండడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్డు మార్జిన్‌లో మట్టిపోస్తున్నారు. పట్టణంలోని తొమ్మల దొడ్డి గుంట నిండి ఇళ్లలోకి నీరు చేరడంతో మోటారు పంపులు ఏర్పాటుచేసి నీటిని కాల్వలకు తరలించారు. 

Updated Date - 2021-11-22T03:56:42+05:30 IST