ఓటీఎస్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-12-09T03:01:47+05:30 IST

ఓటీఎస్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు.

ఓటీఎస్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి
లబ్ధిదారులకు హక్కు పత్రాలను అందజేస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

 కలెక్టర్‌ చక్రధర్‌బాబు

గూడూరు, డిసెంబరు 8: ఓటీఎస్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో  ఆయన మాట్లాడారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద గుర్తించిన వారందరూ ఈనెల 20వ తేదీలోగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  గృహనిర్మాణ శాఖ పథకాల్లో రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న వారికి వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవాకాశం ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అనంతరం చెన్నూరులోని సచివాలయాలను పరిశీలించారు.  ఓటీఎస్‌ కింద నగదు చెల్లించిన 12 మందికి హక్కు పత్రాలను అందజేశారు. కొవిడ్‌ మూడో దశపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కచ్చితంగా మాస్కు ధరించడంతోపాటు భౌతికదూరాన్ని పాటించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మురళీకృష్ణ, తహసీల్దారు లీలారాణి, ఎంపీడీవో నాగమణి, కమిషనర్‌ శ్రీకాంత్‌, తిరుపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-09T03:01:47+05:30 IST