సొంత నిధులతో రహదారి నిర్మాణం
ABN , First Publish Date - 2021-12-27T04:55:01+05:30 IST
పెన్నా వరద ముంపునకు దెబ్బతిన్న ప్రధాన రహదారిని గ్రామస్థులు సొంత నిధులతో ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఇందుకూరుపేట, డిసెంబరు 26 : పెన్నా వరద ముంపునకు దెబ్బతిన్న ప్రధాన రహదారిని గ్రామస్థులు సొంత నిధులతో ఏర్పాటు చేసుకుంటున్నారు.పెన్నా పరివాహక గ్రామమైన నిడిముసలి- ముదివర్తిపాళెం మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. ఇప్పటికి ఆరు వారాలు గడిచినా అధికారులు మరమ్మతులు చేయించలేదు. ఆర్‌అండ్‌బీ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పని కాకపోవడంతో ఇందుకూరుపేట రూరల్ బ్యాంకు అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, గ్రామ నాయకుడు కొండ్లపూడి శ్రీనివాసులురెడ్డి తమ సొంత నిధులతో దాదాపు 400 మీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు. రహదారి లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఈ నిర్మాణం చేపట్టినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో కలిసి ఆదివారం పనులను పర్యవేక్షించారు.