వ్యాక్సినేషన్ లక్ష్యం పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2021-09-04T03:32:11+05:30 IST
కరోనా వ్యాక్సినేషన్‌ను వెంటనే పూర్తి చేయాలని మండ ల ప్రత్యేకాధికారి జీవపుత్ర కుమార్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం ఆయన

సంగం, సెప్టెంబరు 3: కరోనా వ్యాక్సినేషన్‌ను వెంటనే పూర్తి చేయాలని మండ ల ప్రత్యేకాధికారి జీవపుత్ర కుమార్ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పీహెచ్‌సీ వైద్యాధికారితో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వేసిన టీకాల సంఖ్య, కొవిడ్ కేసుల తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ప్రతిమ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.