సెయింట్‌ జోసఫ్‌ ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ రద్దు చేయండి

ABN , First Publish Date - 2021-05-06T03:22:55+05:30 IST

కరోనా బాధితులను ఆరోగ్యశ్రీలో చేర్చుకోకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న సెయింట్‌ జోసఫ్‌ ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటప్రసాద్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు.

సెయింట్‌ జోసఫ్‌ ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ రద్దు చేయండి
ఆసుపత్రిలో తనిఖీలు చేస్తున్న జేసీ, అధికారులు

ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోకు జేసీ ఆదేశం 

కొవిడ్‌ ఆసుపత్రుల ఆకస్మిక తనిఖీ 

నెల్లూరు(వైద్యం), మే 5: కరోనా బాధితులను ఆరోగ్యశ్రీలో చేర్చుకోకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న సెయింట్‌ జోసఫ్‌ ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటప్రసాద్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం నగరంలోని సెయింట్‌ జోసఫ్‌, రవి చెస్ట్‌ ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులపై జేసీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సెయింట్‌ జోసఫ్‌ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వైద్యం పొందుతున్న రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. రవి చెస్ట్‌ ఆసుపత్రిలో ప్రభుత్వం నిర్ధేశించిన జీవో నెంబర్‌ 77 ప్రకారం రోగుల నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. రవి చెస్ట్‌ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ తాత్కాళిక గుర్తింపు ఉందన్నారు. ఏ కేటగిరిలో వైద్య సేవలు అందించాలని సూచించారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే వెంటనే 104, 1902లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ తనిఖీలలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ అహ్మద్‌ఖాన్‌, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటప్రసాద్‌, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయ కర్త డాక్టర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-06T03:22:55+05:30 IST