గ్రామాభివృద్ధికి సహకరిస్తా : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-03-25T03:17:49+05:30 IST

సిరిపురం పంచాయతీ అభివృద్ధికి తనవంతు సహయ సహకారాలు అందజేస్తానని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

గ్రామాభివృద్ధికి సహకరిస్తా : ఎమ్మెల్యే

కావలి రూరల్‌, మార్చి 24: సిరిపురం పంచాయతీ అభివృద్ధికి తనవంతు సహయ సహకారాలు అందజేస్తానని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. కావలి రూరల్‌ మండలం సిరిపురంలో సర్పంచు జక్కంపూడి రమేష్‌బాబు ఆధ్వర్యంలో బుధవారం అధికార పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. మండలం లో సిరిపురం సర్పంచ్‌గా ఏకగ్రీవమైన జక్కంపూడి రమేష్‌బాబును ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం గ్రామంలోని పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌ రెడ్డి, సిరిపురం గ్రామానికి చెందిన తెలంగాణ ఐఆర్‌ఎస్‌ అధికారి ఆలూరు వెంకట్రావ్‌, డీఎస్పీ ప్రసాద్‌, వైసీపీ మండల అధ్యక్షుడు జంపాని రాఘవులు, స్థానిక నాయకులు నాయుడు రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వాసవీ క్లబ్‌ కమిటీకి అభినందన

కావలి వాసవీ క్లబ్‌ నూతన కమిటీలో అధ్యక్షుడు కర్నాటి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి జీ సునీల్‌, కోశాధికారి జీ వెంకటేశ్వర్లు, సభ్యులను ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి అభినందిచారు. బుధవారం ముసునూరులోని ఎమ్మెల్మే నివాసంలో ఆర్యవైశ్య ప్రముఖులు నూతనంగా ఎంపికైన కార్యవర్గానికి ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వారికి ఎమ్మెల్యే మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఎం రామకృష్ణ, గాధంశెట్టి వేణుగోపాల్‌, పాదర్తి నాగరాజు, అనుమాలశెట్టి శివ, ఎక్కల సురేష్‌, సువర్ణ శ్రీను, వేల్చూరి రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-25T03:17:49+05:30 IST