దుకాణాల లీజుకు వేలం

ABN , First Publish Date - 2021-09-04T03:13:23+05:30 IST

స్థానిక పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కావలి డీఎల్‌పీవో రమే్‌షబాబు ఆధ్వర్యంలో పట్టణంలోని మార్కెట్‌ దుకాణాలకు వేలం పాటలు నిర్వహించారు.

దుకాణాల లీజుకు వేలం
వేలంపాటలు నిర్వహిస్తున్న కావలి డీఎల్‌పీవో రమే్‌షబాబు

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 3: స్థానిక పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం కావలి డీఎల్‌పీవో రమే్‌షబాబు ఆధ్వర్యంలో పట్టణంలోని మార్కెట్‌ దుకాణాలకు వేలం పాటలు నిర్వహించారు. మార్కెట్‌లోని మొత్తం పది దుకాణాలకు వేలం నిర్వహించగా ఐదు దుకాణాలను వ్యాపారస్తులు దక్కించుకోగా మరో ఐదు దుకాణాల వేలం వాయిదా పడిందని పంచాయతీ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. వేలం నిర్వహించిన ఐదు దుకాణాలను రూ.2.29 లక్షలు రాబడి వచ్చినట్లు తెలిపారు. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు 15 రోజుల్లో నగదు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు ఉప్పుటూరి శ్రీనివాసులు, సీఏ బాబు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-04T03:13:23+05:30 IST