షార్‌ ఉద్యోగుల ఆందోళన

ABN , First Publish Date - 2021-11-23T05:38:50+05:30 IST

శ్రీహరికోట, (సూళ్లూరుపేట), నవంబరు 22 :

షార్‌ ఉద్యోగుల ఆందోళన

  శ్రీహరికోట, (సూళ్లూరుపేట), నవంబరు 22 : శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం రెండవ గేట్‌ వద్ద సోమవారం ఉదయం షార్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేశారు. 2020 నుంచి ఇవ్వాల్సిన పీఆర్‌ఐహెచ్‌ వెంటనే ఇవ్వాలని, రిస్కీ అలవెన్స్‌ ఇవ్వాలని నినాదాలు చేశారు. 15 నిమిషాల పాటు ఆందోళన చేసి అనంతరం విధులకు హాజరయ్యా రు. తమ సమస్యల సాధన కోసం ఎంప్లాయీస్‌ అసోసి యేషన్‌ ఇలా ప్రతిరోజు విధులకు హాజరయ్యే ముందు ధర్నా చేస్తుందని ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మునిరాజ ప్రకటించారు. 

Updated Date - 2021-11-23T05:38:50+05:30 IST