షాడో సీనియర్‌ మేట్‌ను తొలగించండి

ABN , First Publish Date - 2021-07-13T04:20:35+05:30 IST

మండలంలోని శిరసనంబేడు గ్రామంలో గతంలో ఉపాధిహామీ పథకంలో అవినీతికి పాల్పడి సస్పెండైన క్షేత్ర సహాయకుడు, షాడో సీనియర్‌ మేట్‌ కల్లూరు మల్లికార్జున్‌ను తొలగించాలని సోమవారం ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ గుంటపూడి పెంచలయ్య నెల్లూరులో జేసీ హరేందిర ప్రసాద్‌కు గ్రామస్థుల సంతకాలతో కూడిన వినతిపత్రం సమర్పించారు.

షాడో సీనియర్‌ మేట్‌ను తొలగించండి

 జేసీకి వినతి 

పెళ్లకూరు, జూలై 12 : మండలంలోని శిరసనంబేడు గ్రామంలో గతంలో ఉపాధిహామీ పథకంలో అవినీతికి పాల్పడి సస్పెండైన క్షేత్ర సహాయకుడు, షాడో సీనియర్‌ మేట్‌  కల్లూరు మల్లికార్జున్‌ను తొలగించాలని సోమవారం ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ గుంటపూడి పెంచలయ్య నెల్లూరులో జేసీ హరేందిర ప్రసాద్‌కు గ్రామస్థుల సంతకాలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. ఏపీవో కె. దయానంద్‌కుమార్‌ మల్లికార్జున్‌ భార్య లతను సీనియర్‌ మేట్‌గా నియమించారని, ఆమె నాయుడుపేటలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో నర్సుగా పనిచేసున్నారని తెలిపారు. లత పేరిట మల్లికార్జున్‌ ఉపాధి పనులు చేయిస్తున్నాడని, జేసీ అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీడీవో ప్రమీలారాణి కూడా  మల్లికార్జున్‌కు అండగా ఉన్నారని ఆరోపించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దృష్టికి కూడా సమస్య తీసుకెళ్లామని, న్యాయం జరిగేలా చూడాలని కోరినట్లు తెలిపారు.


Updated Date - 2021-07-13T04:20:35+05:30 IST