ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-02-06T04:46:28+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను మద్యం, నగదు పంపిణీతో ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సీఐ సుంకర శ్రీనివాసులు హెచ్చరించారు.

ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు
అవగాహన కల్పిస్తున్న సెబ్‌ సీఐ శ్రీనివాసులు

సీతారామపురం, ఫిబ్రవరి 5 : పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను మద్యం, నగదు పంపిణీతో ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సీఐ సుంకర శ్రీనివాసులు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఎన్నికల్లో పోటీలో నిలిచే అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగరాదని, అభ్యర్థులపై కేసులు నమోదైతే వారు ఎన్నికల్లో విజయం సాధించినా అనర్హులవుతారన్నారు. ఇప్పటికే మండలంలో 176 మందిని బైండోవర్‌ చేసుకోగా, పలువురిపై మద్యం కేసులు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రవీంద్రనాయక్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T04:46:28+05:30 IST