30 వరకు స్కూళ్ల సెలవులు పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-31T04:39:40+05:30 IST

కరోనా విస్తృతి నేపథ్యంలో జూన 30వ తేదీ వరకు స్కూళ్ల సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

30 వరకు స్కూళ్ల సెలవులు పొడిగింపు

పూర్తికాని నాడు-నేడు పనులు

ఈసారి అయిన జగనన్న విద్యాకానుక అందేనా!?

మండలాలకు చేరని పాఠ్యపుస్తకాలు


నెల్లూరు (స్టోనహౌస్‌పేట), మే 30 : కరోనా విస్తృతి నేపథ్యంలో జూన 30వ తేదీ వరకు స్కూళ్ల సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో గత విద్యాసంత్సరంలో తక్కువ రోజులు పాఠశాలల్లోకి అడుగు పెట్టిన విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం అసలు ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన విఽధంగా జూన 1 నుంచి 2021-22 విద్యాసంవత్సరం ప్రారంభమై ఉంటే ఒడి సిద్ధమా!? అన్న ప్రశ్న అధికారులు, నాయకులు వేసుకుంటే సిద్ధంగా లేదన్న సమాధానాలే ఎక్కువగా వస్తాయి. అప్పుడెప్పుడో కరోనాకు ముందు ప్రారంభించిన నాడు-నేడు పనులు జిల్లాలో ఇప్పటివరకు పూర్తి కాలేదు. పది శాతం పనులు కావాల్సి ఉన్నా ఎప్పుటికి పూర్వవుతాయో అంతుపట్టడం లేదు.


సకాలం విద్యాకానుక అందేనా!?


పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులకు గత యేడాదిలా జగనన్న విద్యాకానుక అందిస్తారా!? లేదా  ఆలస్యం చేస్తారా!? వేచి చూడాల్సి ఉంది. ముందస్తు ప్రభుత్వ ప్రకటన ప్రకారం సోమవారం నుంచి పాఠశాలలు  పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు జిల్లాకు విద్యాకానుకకు సంబంధించిన ఎలాంటి సామగ్రి  చేరలేదు. గత ఏడాది నూతనంగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు అసలు విద్యాకానుక అందించ లేదు. మరి ఈ ఏడాది అయినా ఇస్తారో ఇవ్వరో వేచి చూడాలి. ఇక పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరినా మండల కేంద్రాలకు ఇంకా సరఫరా కాలేదు. 

Updated Date - 2021-05-31T04:39:40+05:30 IST