హిందూధర్మాన్ని కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2021-11-29T02:52:51+05:30 IST

హిందూధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులపై ఉందని గీతాశ్రమం పీఠాధిపతి ప్రణవాత్మానందస్వామి అన్నారు.

హిందూధర్మాన్ని కాపాడుకోవాలి
కరపత్రాలు విడుదల చేస్తున్న ప్రణవాత్మానందస్వామి

గూడూరు, నవంబరు 28: హిందూధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులపై ఉందని గీతాశ్రమం పీఠాధిపతి ప్రణవాత్మానందస్వామి అన్నారు. ఆదివారం స్థానిక కేశవ నిలయంలో సమరసత సేవాసంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబరులో జరిగే ధర్మప్రచారానికి సంబంధించి కరపత్రాలను విడుదల చేశామన్నారు. ప్రతి హిందువు హిందూధర్నాన్ని పరిరక్షించుకోవా లన్నారు. కార్యక్రమంలో శేషాద్రినాయుడు, శ్రీనివాసులు, గణపతి, మునికృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, కార్తీక్‌, మహేశ్వరమ్మ, వేణురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T02:52:51+05:30 IST