60 లీటర్ల సారా, 50 కేజీల బెల్లం స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-15T03:08:27+05:30 IST

బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప సమీపంలోని సీసం ఫ్యాక్టరీ వెనుక అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై కావలి సెబ్‌ సీఐ

60 లీటర్ల సారా, 50 కేజీల బెల్లం స్వాధీనం
నాటుసారాను స్వాధీనం చేసుకున్న సెబ్‌ అధికారులు

బిట్రగుంట, అక్టోబరు 14: బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప సమీపంలోని సీసం ఫ్యాక్టరీ వెనుక అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై కావలి సెబ్‌ సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున దాడులు జరిగాయి. అధికారుల రాకను పసికట్టిన సారా కాస్తున్న వారు పరారు కాగా, బట్టీల వద్ద క్యానులో తీసి ఉంచిన 60 లీటర్ల సారా, 50కేజీల బెల్లాన్ని  స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-10-15T03:08:27+05:30 IST