వెంకటగిరి రైల్వేస్టేషన్‌లో శానిటేషన్ రైలు
ABN , First Publish Date - 2021-05-06T03:27:16+05:30 IST
కరోనా కట్టడిలో భాగంగా బుధవారం స్టేషన్‌లోని అన్ని కార్యాలయాలు, విశ్రాంతిగదులు, మరుగుదొడ్లు, రైల్వే క్వార్టర్లలో పారిశుధ్య పనులు నిర్వహించారు.

వెంకటగిరి, మే 5: కరోనా కట్టడిలో భాగంగా బుధవారం స్టేషన్‌లోని అన్ని కార్యాలయాలు, విశ్రాంతిగదులు, మరుగుదొడ్లు, రైల్వే క్వార్టర్లలో పారిశుధ్య పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా రేణిగుంట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జయంత్‌కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ ఉదృతంగా ఉన్న కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్ డివిజనల్ మేనేజర్ అలోక్ తివారీ చొరవతో బుదవారం రేణిగుంట నుంచి కొండాగుంటవరకు శానిటేషన్ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మార్గంలో ఉన్న అన్ని స్టేషన్లతో పాటు, రైల్వే క్యార్టర్స్‌లో కూడా శానిటేషన్ పనులు చేస్తున్నట్లు తెలిపారు. బుదవారం ఏర్పేడు, రాచగున్నేరి, శ్రీకాళహస్తి, ఎల్లకారు, వెండోడు, కొండాగుంట స్టేషన్లలో పనులు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి రైల్వే స్టేషన్ మేనేజర్ శేషగిరిరావు, హెల్త్ సూపర్‌వైజర్ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.