వచ్చే నెలాఖరుకు సంగం బ్యారేజి పూర్తి
ABN , First Publish Date - 2021-07-09T04:57:14+05:30 IST
సంగం బ్యారేజ్ నిర్మాణం ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు పనులను వేగవంతం చేసినట్లు తెలుగుగంగ చీఫ్ ఇంజనీర్

సంగం, జూలై 8: సంగం బ్యారేజ్ నిర్మాణం ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు పనులను వేగవంతం చేసినట్లు తెలుగుగంగ చీఫ్ ఇంజనీర్ హరినారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన సంగం బ్యారేజ్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని నిర్మాణ నిర్వాహకులకు సూచించారు. జూలై నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉన్నా కొవిడ్ కారణంగా కూలీలు స్వగ్రామాలకు వెళ్లడంతో పనులకు ఆటంకం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యారేజ్ పర్యవేక్షణాధికారులతో పాటు నిర్వాహకులు ఉన్నారు.