ఇసుక తరలింపు వాహనాల అడ్డగింపు
ABN , First Publish Date - 2021-05-22T05:03:13+05:30 IST
మండలంలోని మినగల్లు పెన్నానది ఇసుకరీచ్ నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాలను శుక్రవారం మినగల్లు, అన్నారెడ్డిపాళెం గ్రామాల ప్రజలు అడ్డగించారు.

బుచ్చిరెడ్డిపాళెం, మే 21 : మండలంలోని మినగల్లు పెన్నానది ఇసుకరీచ్ నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాలను శుక్రవారం మినగల్లు, అన్నారెడ్డిపాళెం గ్రామాల ప్రజలు అడ్డగించారు. భారీ వాహనాలు పగలూ..రాత్రి అన్న తేడా లేకుండా ఇసుక తీసుకువెళ్తున్నందున తాము తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని వాపోయారు. ట్రాక్టర్ల రణగొణ ధ్వనులతో నిద్రపోలేక పోతున్నామన్నారు. దీంతో రోడ్లు కూడా ఽధ్వంసమవుతున్నాయన్నారు. డ్రైవర్ల వల్ల కరోనా కూడా గ్రామాల్లో వ్యాపించే అవకాశముందన్నారు. ఈ క్రమంలో తమ గ్రామాల మీదుగా ఇసుక తరలింపునకు ఒప్పుకునే ప్రసక్తేలేదని చెప్పారు. దీంతో ఇసుక రీచ్ నిర్వాహకులు గ్రామస్థులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని తెలిపారు.