పెన్నా నుంచి ఆగని ఇసుక దోపిడీ
ABN , First Publish Date - 2021-05-21T04:18:42+05:30 IST
నెల్లూరులోని భగత్‌సింగ్ కాలనీ సమీపంలో పెన్నా నది నుంచి ఇసుక అక్రమా రవాణా మాత్రం ఆగటం లేదు.

తాజాగా 16 టన్నుల ఇసుక సీజ్ చేసిన ఎస్‌ఈబీ
నెల్లూరు(క్రైం), మే 20: నెల్లూరులోని భగత్‌సింగ్ కాలనీ సమీపంలో పెన్నా నది నుంచి ఇసుక అక్రమా రవాణా మాత్రం ఆగటం లేదు. కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ప్రభుత్వ ఇళ్ల స్థలాలకు తరలిస్తున్నామని అక్రమంగా ఇసుక దందాకు పాల్పడుతున్న పదుల సంఖ్యలో ట్రాక్కర్లను, డ్రైవర్లను ఎస్‌ఈబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నవాబుపేట పోలీసులకు అప్పగించారు. ఇసుక అక్రమ తరలింపులో ఎవరి హస్తం ఉందో నవాబుపేట పోలీసులు ఇప్పటి వరకు తేల్చలేదు. ఈ లోపే ఆ స్టేషన్ సీఐని బదిలీ చేశారు. భగత్‌సింగ్‌కాలనీ సమీపంలో పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నార్న సమాచారం ఎస్‌ఈబీ జాయింట్ డైరెక్టర్ కె. శ్రీలక్ష్మికి అందింది. ఆమె ఆదేశాలతో గురువారం సాయంత్రం ఎస్‌ఈబీ నెల్లూరు-1 ఇన్‌చార్జ్ సీఐ బి. అశోక్‌కుమార్ నేతృత్వంలో సిబ్బంది పెన్నానదిలో దాడులు చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకొని 16 టన్నుల ఇసుకను సీజ్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్లు పి.శ్రీనివాసులు, ఐ గోపాల్, ఎం. రమణయ్య, ఐ. పవన్‌కుమార్‌లను అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ నిమిత్తం నవాబుపేట పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్‌ఈబీ సిబ్బంది అజీజ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.