ప్రభుత్వం ధర కంటే.. మార్కెట్టే నయం!
ABN , First Publish Date - 2021-10-30T04:26:04+05:30 IST
రబీ సీజనలో జిల్లాలోని మెట్ట మండలాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో శనగ సాగు చేస్తారు.
భగ్గుమంటున్న రాయితీ శనగల ధర
సాధారణంగా బహిరంగ మార్కెట్లో లభ్యమయ్యే విత్తనాల ధర కంటే ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాల ధరే తక్కువగా ఉంటుంది. కానీ శనగ విత్తనాల పరిస్థితి ఇందుకు విరుద్దంగా ఉంది. బహిరంగ మార్కెట్‌లో క్వింటం విత్తన శనగలు రూ.4,800 ఉండగా, ప్రభుత్వ ధర 25 శాతం సబ్సిడీ పోను రూ.5,175 చెల్లించాలి. ఉంటోంది. దీనికితోడు ఆర్‌బీకేల్లో ముందుగా నగదు చెల్లించిన తర్వాతే విత్తనాలు వస్తుండటంతో అవి ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి.
ఉదయగిరి రూరల్, అక్టోబరు 29 : రబీ సీజనలో జిల్లాలోని మెట్ట మండలాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో శనగ సాగు చేస్తారు. ఈ ఏడాది అనుకూల వాతావరణం ఉండటం, సకాలంలో వర్షాలు కురవడంతో శనగ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. అత్యధికంగా దుత్తలూరు, వరికుంటపాడు, కలిగిరి, వింజమూరు, కొండాపురం, ఏఎ్‌సపేట, ఆత్మకూరు, అనంతసాగరం, పొదలకూరు, మర్రిపాడు, చేజర్ల తదితర మండలాల్లో శనగ సాగు చేస్తారు.
మార్కెట్లో రూ.5,175
బహిరంగ మార్కెట్‌లో క్వింటం విత్తన శనగలు రూ.4,800 ఉండగా, ప్రభుత్వ ధర క్వింటం రూ.6,900 పూర్తి ధర కాగా, 25 శాతం సబ్సిడీ రూ.1,725 పోను రైతు రూ.5,175 చెల్లించాలి. ఇటీవల వర్షాలు కురవడంతో రైతులు శనగ సాగుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయాధికారులు విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాల్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని చెబుతున్నారు. కానీ ప్రభుత్వ సబ్సిడీ కంటే బహిరంగ మార్కెట్‌లో రూ.375 తక్కువగా ఉండడంతో రైతులు పెద్దగా ఆసక్తి చూపడంలేదనే విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు ఆర్‌బీకేల్లో ముందుగా నగదు చెల్లించిన తరువాతే విత్తనాలు వస్తుండటంతో అవి ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. దీంతో మెట్ట ప్రాంత రైతులు విత్తనాల కోసం ప్రకాశం, కడప జిల్లాలకు వెళుతున్నారు.
ఏడాదికేడాది సబ్సిడీ తగ్గింపు
శనగ విత్తనాలపై ప్రభుత్వం ఏడాదికేడాది సబ్సిడీ తగ్గిస్తూ వస్తోంది. 2019లో క్వింటం ధర రూ.6,200లుగా నిర్ణయించి 50 శాతం సబ్సిడీతో రైతులకు శనగలు అం దించింది. 2020లో సబ్సిడీ 30 శాతానికి తగ్గించడంతోపాటు గతేడాది కంటే క్వింటంపై రూ.1,300 ఽపెంచి రూ.7,500 ధర నిర్ణయించారు. 2021లో క్వింటం రూ.6,900 నిర్ణయించి 25 శాతం సబ్సిడీతో 5,175 ధర నిర్ణయించారు. ప్రతి ఏడాది సబ్సిడీ కిందకు దిగజారుతుండటంతో రైతులు బహిరంగ మార్కెట్ వైపు చూస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పెద్ద ప్రయోజనం చేకూరడంలేదని కొంతమంది రైతులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు.