సమష్టి కృషితో డక్కిలి అభివృద్ధి

ABN , First Publish Date - 2021-12-20T03:22:11+05:30 IST

డక్కిలి మండల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఎంపీపీ గోను రాజశేఖర్‌ అన్నారు. ఆదివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండల సర్వభ్య సమావేశం నిర్వహించారు.

సమష్టి కృషితో డక్కిలి అభివృద్ధి
డక్కిలి మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ రాజశేఖర్‌

ఎంపీపీ గోను రాజశేఖర్‌

డక్కిలి, డిసెంబరు 19 : డక్కిలి మండల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఎంపీపీ గోను రాజశేఖర్‌ అన్నారు. ఆదివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మండల సర్వభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డక్కిలి మండలాన్ని అభివృద్ధి బాటపట్టిస్తామని, అందుకు స్థానిక ప్రజాప్రతినిదులు, అధికారుల సహాయసహకారాలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు సభ దృష్టికి తీసుకొస్తే అధికారులతో చర్చించి పరిష్కరించడం సులభమవుతుందన్నారు.్ల సెంట్రల్‌ బ్యాంకు డైరెక్టరు వెలికలంటి రమణారెడ్డి, దేవునివెల్లంపల్లి ఆలయ చైర్మన్‌ నర్రావుల ప్రకాశం నాయుడు, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు గడ్డం చంద్రశేఖరరెడ్డి, ఎంపీడీవో వసుంధర, డీటీలావణ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-20T03:22:11+05:30 IST