శెభాష్‌

ABN , First Publish Date - 2021-05-09T03:28:05+05:30 IST

పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వైద్యులు కరోనా బాధితులకు సేవలందిస్తూ మన్ననలు పొందుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన రోగులకు ప్రా

శెభాష్‌
: కోవూరు ప్రభుత్వ వైద్యశాల

 మన్ననలు పొందుతున్న ప్రభుత్వ వైద్యులు

కోవూరు, మే7 : పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వైద్యులు కరోనా బాధితులకు సేవలందిస్తూ మన్ననలు పొందుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన రోగులకు ప్రాథమిక వైద్యం అందించి నెల్లూరులోని కొవిడ్‌ సెంటర్‌కు తరలిస్తున్నారు. స్వల్ప ప్రభావమున్న రోగులకు ఐసోలేషన్‌ కేంద్రంలోనే వైద్య సహాయం అందచేస్తున్నారు. వైద్యశాలలలో తగినంత సిబ్బంది లేకపోయినా రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనిచేస్తున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు. ఆసుపత్రి ప్రధాన వైద్యుడు డాక్టర్‌ వెంకటేశ్వరరావు, డాక్టర్‌ యూసఫ్‌  ఫోన్‌లో వైద్యసహాయం కోరిన హోమ్‌ఐసోలేషన్‌ రోగులకు కూడా ఓపికగా సమాధానం ఇస్తున్నారు. రెండు రోజుల కిందట పల్స్‌ శాతం పడిపోయిన ఏడుగురు కరోనా వ్యాధిగ్రస్థుల్ని కాపాడేందుకు డాక్టర్‌ యూసఫ్‌ హుటాహుటిన నెల్లూరుకి వెళ్లి  జేసీ బాపిరెడ్డి మాట్లాడి ఆక్సిజన్‌ను  అందుబాటులోకి తెచ్చారు. దీంతో కరోనా రోగులు, బంధుమిత్రులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సేవాభావాన్ని చాటుకుం టున్న వైద్యులకు, సిబ్బందికి స్ధానికులు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. 


Updated Date - 2021-05-09T03:28:05+05:30 IST