సచివాలయ వ్యవస్థతో మెరుగైన సేవ
ABN , First Publish Date - 2021-09-04T05:10:23+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవ అందించేందుకు వీలవుతుందని ఎస్పీ విజయరావు అన్నారు.

కోవూరు, సెప్టెంబరు 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవ అందించేందుకు వీలవుతుందని ఎస్పీ విజయరావు అన్నారు. కోవూరు పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్ గది, పడుగుపాడులో 2వ సచివాలయ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యస్థాపనకు సచివాలయ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఏఎస్పీ వెంకటరత్నం, డీఎస్పీ హరనాథరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ డీ.వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం డీఏఏబీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజనబాబురెడ్డి, ఎన్‌ఎంసీసీ చైర్మన్ వీరి చలపతిరావు, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పశుసంవర్ధక శాఖ చైర్మన్ గొల్లప్రోలు విజయకుమార్, పడుగపాడు సొసైటీ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, సర్పంచ్ లక్ష్మీనారాయణ, తహసీల్దారు సీహెచ్. సుబ్బయ్య, ఎంపీడీవో శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇనమడుగు జడ్పీ హైస్కూల్‌లో అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు విద్యార్థినులకు, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కుటుంబానికి నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఆర్థికసాయం అందించారు.