ఇలాగైతే కరోనా నియంత్రణ ఎలా?
ABN , First Publish Date - 2021-05-11T04:13:24+05:30 IST
కరోనా రక్కసితో ప్రాణాలు పోతున్నా కొందరిలో చలనం లేదు. మాస్కులు ధరించాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కోరుతున్నా స్పందన లేదు.
అనంతసాగరం, మే 10: కరోనా రక్కసితో ప్రాణాలు పోతున్నా కొందరిలో చలనం లేదు. మాస్కులు ధరించాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని కోరుతున్నా స్పందన లేదు. అనంతసాగరం బ్యాంకు వద్ద ఖాతాదారులు సోమవారం గుంపులుగా గుమికూడారు. ఇక్కడ భౌతి క దూరం పాటించని పరిస్థితి కనిపించింది. కరోనా విస్తరిస్తున్న తరుణం లో ప్రజలు ఇలా గుమికూడడం ఆందోళన కలిగిస్తుంది. బ్యాంకు అదికారు లు ఖాతాదారులకు సర్దిచెబుతున్నా వినిపించుకోని పరిస్థితి. ఇలాగైతే కరోనా నియంత్రణ ఎలా అంటూ పలువురు విమర్శిస్తున్నారు.