బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2021-10-29T04:48:03+05:30 IST

బ్యాంకులు అందచేసే రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు కోరారు.

బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోండి
జ్యోతి ప్రజ్వలన చేసి రుణవితరణ స్టాల్స్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

రుణవితరణ స్టాల్స్‌ ప్రారంభంలో కలెక్టర్‌


నెల్లూరు(హరనాథఫురం), అక్టోబరు 28 : బ్యాంకులు అందచేసే రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు కోరారు.  గురువారం నెల్లూరులో లీడ్‌ బ్యాంకు, లీడ్‌ డిసి్ట్రక్‌ మేనేజర్‌ రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో రుణవితరణ స్టాల్స్‌ ఏర్పాటయ్యాయి. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడుతూ ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలను పొంది ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. రైతులకు, ముఖ్యంగా కౌలు రైతులకు ఇతోధికంగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 900 కోట్ల రుణాలను 35వేల మంది ఖాతాదారులకు బ్యాంకుల ద్వారా అందించినట్లు వెల్లడించారు. అనంతరం కలెక్టర్‌ పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి వివిధ బ్యాంకులు అందించిన మెగా చెక్కులను లబ్ధిదారులకు అందచేశారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రెండు ట్రాక్టర్లను రైతులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో  లీడ్‌ డిసి్ట్రక్ట్‌ మేనేజర్‌ రామ్‌ ప్రసాద్‌రెడ్డి,  ఏపీజీబీ చైర్మన రాకేష్‌ కశ్యప్‌, కెనరా బ్యాంకు డీజీఎం మురళీధర్‌ బెహరా, నాబార్డు డీడీఎం రవిసింగ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్‌ఎం సీతారాం, కెనరా బ్యాంకు ఆర్‌ఎం శ్రీనివాసకణ్ణన, ఎస్బీఐ ఆర్‌ఎం జీవీ పవనకుమార్‌, యుబీఐ ఆర్‌ఎం శేషగిరిరావు, జిల్లా కేంద్ర సహకారబ్యాంకు సీఈఓ చల్లా శంకర్‌బాబు, డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి, వ్యవసాయశాఖ జేడీ ఆనందకుమారి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T04:48:03+05:30 IST