మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు
ABN , First Publish Date - 2021-09-04T03:14:58+05:30 IST
మానవ తప్పిదాల వల్లే 90 శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని డిప్యూటీ సీటీఎం చిరంజీవి తెలిపారు.

డిప్యూటీ సీటీఎం చిరంజీవి
ఉదయగిరి రూరల్, సెప్టెంబరు 3: మానవ తప్పిదాల వల్లే 90 శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని డిప్యూటీ సీటీఎం చిరంజీవి తెలిపారు. శుక్రవారం స్థానిక డిపోలో రోడ్డు భద్రతా పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ కంటే డ్రైవర్ గొప్పవాడని, డాక్టర్ చేతిలో ఒకరి ప్రాణం మాత్రమే ఉంటుందని, డ్రైవర్ చేతిలో 50 నుంచి 60 మంది ప్రాణాలు ఉంటాయన్నారు. రీజియన్‌లో ప్రమాదాలు రేటు 0.05గా ఉందని, దానిని తగ్గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. డ్రైవర్లు ఏకాగత్రతో డ్రైవింగ్ చేయాలన్నారు. ప్రజా రవాణా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేస్తూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు. త్వరలో డ్రైవర్ల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ప్రతా్‌పకుమార్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రాము, ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, వెంకటేశ్వర్లు, కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.