బూదూరులో ఆర్టీసీ బస్సు అడ్డగింత

ABN , First Publish Date - 2021-10-15T03:30:54+05:30 IST

దొరవారిసత్రం మండలం బూదూరు గ్రామంలో గురువారం స్థానికులు ఆర్టీసీ బస్సును అడ్డుకు న్నారు.

బూదూరులో ఆర్టీసీ బస్సు అడ్డగింత

దొరవారిసత్రం, అక్టోబరు 14 : దొరవారిసత్రం మండలం బూదూరు గ్రామంలో గురువారం స్థానికులు ఆర్టీసీ బస్సును అడ్డుకు న్నారు. పాతికేళ్లుగా సూళ్లూరుపేట డిపో నుంచి బూదూరుమీదుగా తిరుపతికి బస్సు నడిపేవారని, ప్రస్తుతం డిపో అధికారులు హఠాత్తుగా ఈ సర్వీసును రద్దుచేయడంతో, ఆ మార్గంలో వచ్చిన ఆర్టీసీ బస్సును నిలిపి తమ నిరసనను వ్యక్తం చేశారు. తిరుమల దర్శనానికి, వైద్య అవసరాల నిమిత్తం తిరుపతికి వెళ్లేందుకు గ్రామస్థులకు అనుకూలంగా ఉన్న ఈ సర్వీసును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-10-15T03:30:54+05:30 IST