రూ.7.09 లక్షల నగదు స్వాధీనం

ABN , First Publish Date - 2021-05-31T04:00:32+05:30 IST

ఓజిలి మండలం రావిపాడు గ్రామంలో జరిగిన రెండు చోరీ కేసుల్లో నిందితుడి నుంచి 7.09 లక్షల నగదు, 1.17 లక్షల విలువైన నగలు, 20 వేల విలువచేసే సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

రూ.7.09 లక్షల నగదు స్వాధీనం
విలేకరుల సమావేశంలో వివరాలు తెలుపుతున్న గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి

నిందితుడి నుంచి నగలు, సెల్‌ఫోన్‌ కూడా..

 వివరాలు తెలిపిన గూడూరు డీఎస్పీ

ఓజిలి, మే 30 : ఓజిలి మండలం రావిపాడు గ్రామంలో జరిగిన రెండు చోరీ  కేసుల్లో నిందితుడి నుంచి 7.09 లక్షల నగదు, 1.17 లక్షల  విలువైన నగలు, 20 వేల విలువచేసే సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కేసుల వివరాలు విలేకరులకు తెలిపారు. ఈ నెల 12వ తేదీన రావిపాడులోని పార్వతమ్మ ఇంట్లో 8.94 లక్షలు, అంతకుముందే ఆ గ్రామంలోని వెంకటరమణయ్య ఇంట్లో 1.02 లక్షల విలువైన నగలు చోరీకి గురయ్యాయి. నగదు చోరీపై అందిన ఫిర్యాదు మేరకు వాకాడు సీఐ నరసింహరావు, ఓజిలి ఎస్‌ఐ శేఖర్‌బాబు దర్యాప్త చేపట్టారు. ఆ గ్రామానికి చెందిన వేణుంబాక చంద్రశేఖర్‌పై అనుమానం రావడంతో అతని కదలికలపై నిఘా ఉంచారు. డిగ్రీ చదువుతూ మధ్యలో ఆపివేసి చెడు వ్యసనాలకు లోనైన చంద్రశేఖర్‌  అప్పుల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో తన మేనమామ వెంకటరమణయ్య ఇంట్లో 1.02 విలువ చేసే నగలు చోరీ చేసి తన ఇంట్లో దాచాడు. అనంతరం పార్వతమ్మ కుమారుడు గురుప్రసాద్‌తో స్నేహం పెంచుకుని  వారింట్లో ఈనెల 12న రూ. 8.94 లక్షలు చోరీ చేశాడు. ఆ నగదులో రూ. 20 వేలకు సెల్‌ఫోన్‌, రూ. 15 వేలతో ఒక తాళిబొట్టు కొనుగోలు చేశాడు. పెద్దపరియ క్రాస్‌రోడ్డు వద్ద నిందితుడు చంద్రశేఖర్‌ను  పోలీసులు అరెస్టు   చేసి అతని నుంచి నగదు, నగలు, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన వాకాడు సీఐ నరసింహారావు, ఓజిలి ఎస్‌ఐ శేఖర్‌బా బుతోపాటు ఏఎస్‌ఐ సిరాజ్‌, సిబ్బంది సుబ్బారావు, రామ్మూర్తి, సాయి, క్రాంతిలను డీఎస్పీ అభినందించారు.

Updated Date - 2021-05-31T04:00:32+05:30 IST