ఆకట్టుకున్న నేతాజీ రూ.125 నాణెం

ABN , First Publish Date - 2021-06-23T03:25:53+05:30 IST

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల రూ.125 నాణెం విడుదల చేసింది

ఆకట్టుకున్న నేతాజీ రూ.125 నాణెం
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి నాణెంతో మహ్మద్‌ వాయిజ్‌

ఏఎస్‌ పేట, జూన్‌ 22: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతి సందర్భంగా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల రూ.125 నాణెం విడుదల చేసింది. దీనిని అనుమసముద్రం గ్రామానికి చెందిన కరెన్సీ ప్రియుడు మహ్మద్‌ వాయిజ్‌ రూ.3,200లకు కోనుగోలు చేశారు. మంగళవారం రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి పోస్టల్‌ ద్వారా వచ్చిన ఈ నాణెంను ఆయన అందుకున్నాడు. ఇలా ప్రభుత్వం పలు సందర్భాలలో విడుదల చేసే నాణేలు, కరెన్సీలను కోనుగోలు చేసి వాటి ప్రదర్శిస్తుంటారు. అదేవిధంగా నేతాజీ నాణెంను మహ్మద్‌ వాయిజ్‌ ప్రదర్శించారు.

Updated Date - 2021-06-23T03:25:53+05:30 IST