ఆర్‌ఆర్‌ఆర్ అభిమానుల సందడి
ABN , First Publish Date - 2021-12-10T02:44:47+05:30 IST
సూళ్లూరుపేటలోని వీఎపిక్ థియేటర్‌లో (బాహుబలి థియేటర్) బుధవారం ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా టీడీపీ నేతలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు.

సూళ్లూరుపేట, డిసెంబరు 9 : సూళ్లూరుపేటలోని వీఎపిక్ థియేటర్‌లో (బాహుబలి థియేటర్) బుధవారం ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా టీడీపీ నేతలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. ట్రైలర్‌ను ప్రదర్శించిన అనంతరం కేక్ కట్ చేశారు. తిరుపతి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి, గూడూరు డివిజన్ నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, సూళ్లూరుపేట పట్టణ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు వాకిచర్ల రమేష్, టీడీపీ నేత చిట్టేటి పెరుమాళ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సాంబశివరావు, చంద్రశేఖర్, కట్టబోయిన వెంకటేష్, ఇమ్మల లోకేష్, కొణిదల అభిమానులు పాల్గొన్నారు.
అభిమానుల ఆగ్రహం
నాయుడుపేట టౌన్ : ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ట్రైలర్ విడుదల సందర్భంగా గురువారం నాయుడుపేటలోని ఓ ఽథియేటర్ వద్ద అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ ట్రైలర్‌ను చూసేందుకు పలువురు అభిమానులు ఆ ఽథియేటర్ వద్దకు చేరుకున్నారు. చెప్పిన సమయానికి ట్రైలర్‌ను ప్రదర్శించకపోవడంతో ఆగ్రహించిన అభిమానులు ఒక్కసారిగా థియేటర్ గేట్లను తోసుకొని లోపలికి వెళ్లడంతో ఽయాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు అక్కడకు చేరుకొని అభిమానులను అనునయించి పంపించారు.