రౌడీయిజంతో రాజకీయాలు చేస్తారా ?

ABN , First Publish Date - 2021-02-02T02:59:33+05:30 IST

రౌడీయిజంతో రాజకీయాలు చేసేందుకు అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసు

రౌడీయిజంతో రాజకీయాలు చేస్తారా ?
మాట్లాడుతున్న పసుపులేటి సుధాకర్‌


 బీజేపీ నేత పసుపులేటి సుధాకర్‌

కావలిటౌన్‌, ఫిబ్రవరి1: రౌడీయిజంతో రాజకీయాలు చేసేందుకు అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని  బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి సుధాకర్‌ ఆరోపించారు. సోమవారం బోగోలులో ఆయన విలేకరులతో సమావేశంలో  బీజేపీ బలపరిచిన అభ్యర్ధులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రజాస్వాయ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల పక్రియను వైసీపీ నేతలు అప్రదిష్టపాలు చేస్తున్నారన్నారు. అన్నీ పంచాయతీలకు బీజేపీ మద్దతుదారులు పోటీ చేసితీరుతా రని, బెదిరింపులతో వెనక్కుతగ్గే ప్రశ్నేలేదన్నారు. అధికారులు కూడా శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ జరిగేలా కృషి చేయాలన్నారు. 

 అభ్యర్థులతో సమావేశం ఎన్నికల్లో పోటీ చేయనున్న బీజేపీ బలపరిచిన అభ్యర్ధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, మద్దతుదారులతో పసుపులేటి సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలు తీసుకోల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసారు. కేంద్ర నిధులతోనే గ్రామాభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని ప్రజలకు చెప్పి వారిలో చైతన్యం నింపగలిగితే గెలుపు మనదేనని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు, అభ్యర్ధులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-02T02:59:33+05:30 IST