వ్యవహారశైలి మార్చుకోవాలి

ABN , First Publish Date - 2021-08-11T04:25:06+05:30 IST

సచివాలయ సిబ్బంది వ్యవహారశైలి మార్చుకోవాలని లేకుంటే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని కావలి ఆర్డీవో శీనానాయక్‌ హెచ్చరించారు.

వ్యవహారశైలి మార్చుకోవాలి
సచివాలయ సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్న ఆర్డీవో శీనానాయక్‌

ఆర్డీవో శీనానాయక్‌

అల్లూరు, ఆగస్టు 10: సచివాలయ సిబ్బంది వ్యవహారశైలి మార్చుకోవాలని లేకుంటే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని కావలి ఆర్డీవో శీనానాయక్‌ హెచ్చరించారు. మంగళవారం ఆయన అల్లూరులో పర్యటించి సచివాలయం-2, 3లను పరిశీలించారు. ఇటీవల లబ్ధిదారుల నుంచి వచ్చిన అర్జీల వివరాలు నమోదు చేసిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం సిబ్బంది నుంచి రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ లక్ష్యంతో సచివాలయాలు, ఇంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసిందని, ఆ లక్ష్యం నెరవేర్చాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ సుధీర్‌, వీఆర్వో రహంతుల్లా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-11T04:25:06+05:30 IST