బాణసంచా వ్యాపారులు నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-10-30T05:01:35+05:30 IST

బాణసంచా విక్రయాలు జరిపే దుకాణదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ ఆదేశించారు.

బాణసంచా వ్యాపారులు నిబంధనలు పాటించాలి
అధికారులు, దుకాణదారులతో సమావేశంలో ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌

ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌

నెల్లూరు (వెంకటేశ్వరపురం), అక్టోబరు 29 : బాణసంచా విక్రయాలు జరిపే దుకాణదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ ఆదేశించారు. దీపావళి నేపథ్యంలో నగరంలోని ఆయన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం డివిజన్‌ పరిధిలోని సంబంధిత అధికారులు, దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. దుకాణదారులు తప్పనిసరిగా అగ్నిమాపకశాఖ ఉత్తర్వులను పాటించాలన్నారు. కరోనా నేపఽథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేవలం గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే అమ్మకాలు జరపాలని, విక్రయాలు జరిపే ప్రాంతంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్డీవో కార్యాలయ ఏవో మధుసూదన్‌రావు, పలువురు తహసీల్దార్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T05:01:35+05:30 IST