లేఅవుట్లను పరిశీలించిన ఆర్డీవో

ABN , First Publish Date - 2021-03-25T03:09:04+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని టోల్‌గేట్‌ వద్ద ఉన్న లేఅవుట్‌ను, దామరమడుగు వద్ద మరో లేఅవుట్‌ను బుధవారం నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ పరిశీలించారు.

లేఅవుట్లను పరిశీలించిన ఆర్డీవో
బుచ్చి జాతీయ రహదారి వద్ద టోల్‌గేట్‌ వద్ద లేఅవుట్‌ను పరిశీలిస్తున్న ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌

 బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 24: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని టోల్‌గేట్‌ వద్ద ఉన్న లేఅవుట్‌ను, దామరమడుగు వద్ద మరో లేఅవుట్‌ను బుధవారం నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ పరిశీలించారు. లేఅవుట్‌కు సంబంధించి ల్యాండ్‌ కన్వర్షన్‌ కోసం రియల్టర్లు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వచ్చినట్లు తెలిపారు. ముందుగా లేఅవుట్‌ను, నీటిపారుదల కాలువలను పరిశీలించి, వాటి వివరాల గురించి తహసీల్దారు, రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం లేఅవుట్‌ సర్వేనెంబర్లు, భూమి స్థితిగతులపై రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు తులసీమాల, సర్వేయర్‌, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-25T03:09:04+05:30 IST