ఉద్యోగులు రేషన్‌కార్డులు అప్పగించాలి

ABN , First Publish Date - 2021-08-28T04:54:06+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సచివాలయ ఉద్యోగులు రేషన్‌కార్డులు కలిగి ఉంటే శనివారం నాటికి రెవెన్యూ కార్యాలయానికి తిరిగి ఇవ్వాలని

ఉద్యోగులు  రేషన్‌కార్డులు అప్పగించాలి

 మనుబోలు, ఆగస్టు 27: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సచివాలయ ఉద్యోగులు రేషన్‌కార్డులు కలిగి ఉంటే శనివారం నాటికి రెవెన్యూ కార్యాలయానికి తిరిగి ఇవ్వాలని తహసీల్దార్‌ నాగరాజు తెలిపారు. ఇప్పటివరకు పైన తెలిపిన ఉద్యోగులు రేషన్‌కార్డులు పొంది న వారు మండలంలో 77 మంది ఉండగా ఆరుగురు మాత్రమే ఇచ్చార న్నారు. మిగిలిన వారు ఇవ్వకపోతే ఉన్నతాధికారుల ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2021-08-28T04:54:06+05:30 IST