శేషవాహనంలో శ్రీరంగనాథుడు

ABN , First Publish Date - 2021-03-25T05:02:32+05:30 IST

తల్పగిరి రంగనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి స్వామివారు శేషవాహనంలో ఊరేగారు. ఉదయం ధ్వజారోహణం వేడుక కనుల పండువగా జరిగాయి.

శేషవాహనంలో శ్రీరంగనాథుడు

నెల్లూరు(సాంస్కృతికం), మార్చి 24 : తల్పగిరి రంగనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి స్వామివారు శేషవాహనంలో ఊరేగారు. ఉదయం ధ్వజారోహణం వేడుక కనుల పండువగా జరిగాయి. పద్మశాలి బహుత్తమం సంఘం తరపున కోలాట శ్రీనివాసులు బృందం స్వయంగా నేసిన ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. అర్చకస్వాములు ఆ ధ్వజపటానికి ప్రత్యేక పూజలు జరిపి ఆరోహణ చేశారు. అనంతరం శ్రీదేవి - భూదేవి సమేత రంగనాఽథస్వామికి పేట ఉత్సవం నిర్వహించారు. రాత్రి శేష వాహనంపై నగరోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాలను ఉత్సవ కమిటీ చైర్మన్‌ శ్రీరామ్‌ సురేష్‌,  కమిటీ సభ్యులు, ఈవో వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. 

Updated Date - 2021-03-25T05:02:32+05:30 IST