ఊనుగుంటపాళెంలో రైతు దగా దినోత్సవం

ABN , First Publish Date - 2021-07-09T03:27:13+05:30 IST

మండల పరిధిలోని ఊనుగుంటపాళెంలో గురువారం మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఊనుగుంటపాళెంలో రైతు దగా దినోత్సవం
రైతులతో కలసి నినాదాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, రైతులు

కోట, జూలై 8 : మండల పరిధిలోని ఊనుగుంటపాళెంలో గురువారం మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు,  రైతులు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ రైతు దినోత్సవం జరిపే అర్హత ప్రభుత్వానికి లేదన్నారు. ఇది రైతు దినోత్సవంకాదని రైతు దగా దినోత్సవం అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా  విఫలమైందన్నారు. గత ఏడాది పంటలు నష్టపోయిన రైతులకు సాయం అందించడంలో విఫలమైందన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ చేఆరు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి, తిరుపతి పార్లమెంట్‌ కార్యదర్శులు రాధాకృష్ణారెడ్డి, జలీల్‌ అహ్మద్‌, మోహన్‌రెడ్డి, మధుయాదవ్‌, రఘురామరెడ్డి, మస్తాన్‌బాషా, తదితరులు పాల్గొన్నారు. Updated Date - 2021-07-09T03:27:13+05:30 IST