వేరుశనగ రైతుల్లో ఆందోళన

ABN , First Publish Date - 2021-08-22T04:14:11+05:30 IST

బోగోలు మండలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న అకాల వర్షా లకు వేరుశనగ రైతుల్లో శనివారం గుబులు మొదలైంది. పంట పొలాల్లో పీకి ఉంచిన

వేరుశనగ రైతుల్లో ఆందోళన

బిట్రగుంట, ఆగస్టు 21: బోగోలు మండలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న అకాల వర్షా లకు వేరుశనగ రైతుల్లో శనివారం గుబులు మొదలైంది. పంట పొలాల్లో పీకి ఉంచిన వేరుశనగ ఓదెలు వర్షపు నీరు నిల్వ ఉండటం, కోతకు వచ్చిన పంట ఎక్కడ చేజారిపోతుందోనని ఆవేదన చెందుతున్నారు. ఏబి కండ్రిక, జేపీగూడూరు, ఎస్‌జీవీ కండ్రిక  పంచాయతీలో కొంత మేరకు కోతలు పూర్తయినా నాగులవరం, బోగోలు, తాళ్ళూరు పంచాయతీలలో కోతలు మొదలు కానున్నాయి. ఇదేవిధంగా వర్షాలు కొనసాగితే వేరుశనగ రైతు తీవ్రంగా నష్టపోక తప్పదని అంటున్నారు.

Updated Date - 2021-08-22T04:14:11+05:30 IST