గూడూరులో వర్షం
ABN , First Publish Date - 2021-05-22T04:17:15+05:30 IST
పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది.

గూడూరురూరల్, మే 21: పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండతీవ్రత ఉన్నా సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై కొద్దిసేపు గాలులు వీచాయి. గంటపాటు వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లు బురదమయమయ్యాయి. వాతావరణం చల్లబడడంతో ఉక్కపోతకు అల్లాడుతున్నవారు సేదతీరారు.