అంగన్‌వాడీలకు నాసిరకం బియ్యం!

ABN , First Publish Date - 2021-08-11T04:31:44+05:30 IST

మండల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పంపిణీ చేసేందుకు నాసిరకం బియ్యం సరఫరా చేశారు.

అంగన్‌వాడీలకు నాసిరకం బియ్యం!
సాధారణం కంటే పొడవుగా ఉన్న నాసిరకం బియ్యం

పిల్లల తల్లిదండ్రుల ఆందోళన

కొండాపురం, ఆగస్టు 10: మండల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పంపిణీ చేసేందుకు నాసిరకం బియ్యం సరఫరా చేశారు. పాఠశాలలు జరగనందున ఆ బియ్యాన్ని చిన్నారుల తల్లులకు ఇంటి వద్దకు తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుఎర్రబల్లి పంచాయతీలో పలు కేంద్రాల్లో మంగళవారం పంపిణీ చేసిన బియ్యం సాధారణ బియ్యం కంటే పొడవుగా ఉండటాన్ని గుర్తించిన చిన్నారుల తల్ల్లులు అవి నాసిరకం బియ్యంగా గుర్తించి అంగన్‌వాడీ కార్యకర్తలకు తెలియచేశారు. స్పందించిన అంగన్‌వాడీ సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తల్లులకు ఇచ్చిన బియ్యాన్ని తిరిగి కేంద్రాలకు తెప్పించారు. ఈ విషయంపై సీడీపీవో పద్మను వివరణ కోరగా బియ్యం రేషన్‌ దుకాణం నుంచి తెచ్చుకుంటామన్నారు. పంపిణీ చేసిన నాసిరకం బియ్యాన్ని వింజమూరు ఎంఎల్‌ఎస్‌ కేంద్రానికి తెప్పించి అక్కడ పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామన్నారు.


Updated Date - 2021-08-11T04:31:44+05:30 IST